‎జై‬ కాపు జై ముద్రగడ

కాపువాడిగా‬ జీవిద్దం ఇతర కులాల ని గౌరవిద్దం

Chilakaluripet illegal cows trade for meat | Chilakaluripet illegal cows trade for meat

సడలని దీక్ష...

  • రాత్రివేళ కిర్లంపూడిలో ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
  • రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు విరమించేదిలేదు
  • కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టీకరణ
  • వైద్యపరీక్షలు జరిపించేందుకని వివరణ
  • బాగానే ఉన్నా... పరీక్షలొద్దన్న ముద్రగడ
  • కిర్లంపూడిలో కొనసాగుతున్న పోలీసు ఆంక్షలు
  • వెల్లువలా సంఘీభావం, జోరుగా పరామర్శలు
  • భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు
  • గ్రామగ్రామాన మార్మోగుతున్న ఖాళీ ప్లేట్ల చప్పుళ్లు
  • రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమవుతున్న ఉద్యమం
అడుగుడుగునా పోలీసుల పహారా... గ్రామ జనాభాను మించిన సంఖ్యలో రక్షక భటులు... వారి బూట్ల చప్పుళ్లతో పాటు అదరగొట్టే అదిలింపులు బెదిరింపులు... పోలీసులు నిలువరిస్తున్నా ప్రాధేయపడుతూ.. బైఠాయిస్తూ.. తగవుపడుతూ ముందుకే సాగుతున్న జనం... తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో శనివారంనాటి దృశ్యాలివి....  కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన సతీమణి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శనివారం రెండోరోజుకు చేరుకుంది.

ముద్రగడ దంపతులను చూడడానికి, పరామర్శించడానికి, సంఘీభావం తెలపడానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ‘మా ప్రాణాలు పోయినా పర్లేదు. ప్రభుత్వం మా డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించేవరకు దీక్ష విరమించేది లేదు’ అని ముద్రగడ స్పష్టం చేశారు.

క్షీణించిన పద్మావతి ఆరోగ్యం
ముద్రగడ సతీమణి పద్మావతి (56) ఆరోగ్య పరిస్థితి శనివారం క్షీణించింది. ఆమెకు గతంలో వెన్నెముక శస్త్రచికిత్స జరిగింది. ఉదయం నుంచీ ఆమె పడుకునే దీక్ష కొనసాగించారు. దీక్ష ప్రారంభించే సమయానికి ఆమె బరువు 74 కిలోలు, బీపీ 180/110, సుగర్ 121 ఉన్నాయి.

శుక్రవారం ఆమెకు ప్రతి మూడు గంటలకోసారి మొత్తం నాలుగుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రానికి సుగర్ తగ్గుతూ వచ్చింది. రెండో రోజు ఉదయం 9 గంటలకు వైద్య బృందం ఆమెకు పరీక్షలు నిర్వహించింది. సుగర్ 103, బీపీ 140/90 ఉందని వైద్యులు తెలిపారు.

పెద్ద ఎత్తున మహిళల సంఘీభావం
ముద్రగడ దంపతులను పరామర్శించేవారి సంఖ్య శనివారం బాగా పెరిగింది. ప్రధానంగా డ్వాక్రా మహిళలు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో దీక్షాస్థలికి తరలి వచ్చి పద్మనాభం దంపతులకు సంఘీభావం తెలిపారు. పరిసర గ్రామాల నుంచి వెయ్యిమందికి పైగా మహిళలు కిర్లంపూడి చేరుకున్నారు. దీక్షలో ఉన్న ముద్రగడ సతీమణి పద్మావతిని పలుకరించి వారు కన్నీరు పెట్టుకున్నారు.  
 
కాగా కిర్లంపూడికి చెందిన మహిళలు కూడా పెద్ద సంఖ్యలో  వచ్చి పద్మావతికి సంఘీభావం తెలిపారు. అయితే ర్యాలీగా వస్తున్న మహిళలను పోలీసులు తొలుత స్థానిక ఏనుగు వీధి సెంటర్‌లో అడ్డగించడంతో వారు రోడ్డుపై బైఠాయించారు. ముద్రగడ సతీమణికి ఏదైనా జరిగితే తాము ఆత్మహత్యకు సిద్ధపడతామని హెచ్చరించారు. ఐదుగురు చొప్పున దీక్షా శిబిరం వద్దకు వెళ్లేందుకు అనుమతించడంతో మహిళలు శాంతించారు.

Mudragada, wife on indefinite fast for Kapu reservation

Kapu community leader Mudragada Padmanabham and his wife Padmavathi have begun fast-unto-death protest in their home town Kirlampudi, East Godavari, Andhra Pradesh on Friday.

Addressing the media, Mr. Mudragada said he will continue fast until the demand is fulfilled. His appeal to all supporters was to observe fast in their respective homes.

"Don't give way to any untoward incidents. Don't come to Kirlampudi to give security to me. I'm safe," Mr. Mudragada told his supporters.

Though Mr. Mudragada rejected police protection, unprecedented security has been deployed in Kirlampudi village, in view of the protest. RAF and CRPF personnel have been posted in the village.